MovieGQ

Ra Ragamayi

143 (2004) · Track 5 of 6 · 4:52

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

త... తాననినా తన్నానా తాననినా తాన్నానా ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా రా... రాగమై రమ్మన్నా! తా... తాళమై నేనున్నా! ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా రా... రాధనై రమ్మన్నా.! రా... రాతిరై నేనున్నా.! ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా స్నేహపురి దారుల్లో ప్రేమపురి వీధుల్లో సిగ్గుపురి నీడల్లో సొగసుపురి మేడల్లో చేరుకోనా సిరిమల్లెల గుర్రం పైనా చేర్చుకోనా నిను నాలో రా... రాగమై రమ్మన్నా! తా... తాళమై నేనున్నా! ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా విరహం నన్నే తరిమేస్తుంటే పైపై కొస్తూ భయపెడుతుంటే దాగుండిపోనా నీ గుండెల గుహలోన బందీనైపోనా.!! నీ చేతుల చెరలోన పైన నీ పైన పడుతుంటే చీకటివాన లేనా నేలేనా చంద్రుణ్ణే గొడుగుగ తేనా చూపుల సుందర వదనా మాపటి వేళల మదనా అయిదారడుగులు ఉన్నా.! నీ అడుగుకు మడుగవనా రా... రాధనై రమ్మన్నా.! రా... రాతిరై నేనున్నా.! ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా తాపం నన్నే వేధిస్తుంటే దాహం నేడే పీడిస్తుంటే తలదాచుకోనా నీ పెదవుల తడిలోనా పడవేసుకోనా.? నీ మధువుల నదిలోనా లోనా నీలోనా పుడుతుంటే తుమ్మెదకూనా కానా జతకానా ప్రాయాన్నే పువ్వుగ తేనా మనసున దోచిన సుగుణ మలుపుల తిరిగిన రచన పరువపు హిమగిరినైనా.!! నీ ప్రేమకు నీరవనా రా... రాగమై రమ్మన్నా! తా... తాళమై నేనున్నా! ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా ధిరనా ధిక్ ధిరనా ధిరనా ధిరనా ధిరనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from 143

See All