Endukani
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- ఎందుకనీ... ఎందుకనీ... ఏమిటనీ... ఏమిటనీ...
బిగి బిగి చెరసాలా బిగిసెను ప్రియురాలా
చిటపట చిరుజ్వాలా కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్యపు గగనంలా
ఎందుకనీ... ఏమిటనీ...
నీ అడుగులలో అడుగులు వేసి నడిచిన బంధమిలా
ఒంటరి తనమై క్షణమొక యుగమై మిగిలే ఏమిటిలా
ఆరిన పెదవుల మాటలికా... నామాటలికా నామాటలికా
చేరున చెలి నీదాకా... దాకా... దాకా... దాకా
ప్రియతమా నమ్ముమా ప్రాణం వున్నది నీకోసం
నా కనులలో నిన్నటి నీరూపం
ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ.... ఏమిటనీ....
వెలుగులు చిలికే చిరు జాబిలని మబ్బులు కమ్మె ఇలా
చిగురులు తొడిగే చిరు నగవులపై చీడే చేరెనెలా
చిలిపిగా చేసిన బాసలిలా... ఆ బాసలిలా ఆ బాసలిలా
నా మదినే తొలిచేనా... తొలిచేనా
కాటుకై చేరనా కంటిలో దాగిన కన్నీరై నీ చెక్కిలి తాకన చిరు ఆశై
ఎందుకనీ.... ఏమిటనీ....
బిగి బిగి చెరసాలా బిగిసెను ప్రియురాలా
చిటపట చిరుజ్వాలా కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్యపు గగనంలా
- ఎందుకనీ... ఎందుకనీ... ఏమిటనీ... ఏమిటనీ...
143
Movie More SongsEndukani Keyword Tags
-
-
-