MovieGQ

Kalalona

143 (2004) · Track 2 of 6 · 4:44

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

కలలోన నువ్వే ఇలలోన నువ్వే కలలోన నువ్వే ఇలలోన నువ్వే కన్నీటి వరదై కమ్మేసినావే గుండెలోన కూసిన కోయిలా గొంతుమూగదైనది ఏంటిలా హృదయపు లయలకు కిలకిలా మరి నేర్పిన చెలిమే లేదెలా నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా జాలువారె వెన్నెలా పొంగిపోవే అలా కలలోన నువ్వే ఇలలోన నువ్వే కన్నీటి వరదై కమ్మేసినావే ఆపవే ఆపవే అల్లరింకా ఈ అల్లిబిల్లి ఆగడాలు ఏలా చేరవే చేరవే చంద్రవంకా చిమ్మి చీకటేగ చిన్నినవ్వు లేకా నువ్వు వాగల్లే వస్తే చెలి మెరుపుల అలనే నేనౌతా చిరుగాలై వీస్తే నే ఎదురుగ నిలబడి అల్లుకుంటా ఓ...పాపను నేనంటా ఓ...అమ్మవు నీవంటా నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా జాలువారే వెన్నెలా పొంగిపోవే అలా కలలోన నువ్వే ఇలలోన నువ్వే కన్నీటి వరదై కమ్మేసినావే మెత్తగా మత్తుగా మల్లెపువ్వా నీ చెంపమీద కోటి ముద్దులివ్వా మెల్లగా చల్లగా చిట్టిగువ్వా సన్నమూగ సైగ చేసే కాలిమువ్వా నువు ఎదపై పడుకుంటే నిను ఊపే ఊయల నేనవుతా చిరునవ్వే వరమిస్తే నీ పెదవిని చినుకై తడిపేస్తా ఓ...మృదుపాదం నీవంటా ఓ...నేలను నేనంటా నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా జాలువారే వెన్నెలా పొంగిపోవే అలా కలలోన నువ్వే ఇలలొన నువ్వే కన్నీటి వరదై కమ్మేసినావే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from 143

See All