Thiru Thiru Gananadha
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
నీ వెలుగు పంచు మా తెలివి లోన కొలువై...
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
ససని సగస సగమ
మమగ మపమ మపని
పప మపనిస సని సగస నిసని పనిస మపమ గమగస
ససని సగస సగమ
మమగ మపమ మపని
పప మపనిస సని ఆ ఆ ఆ
చెవులారా వింటూనే ఎంత పాటమైనా
ఈజీగ తలకెక్కే ఐక్యూ నివ్వు
కనులారా చదివింది ఒకసారే అయినా
కళ్ళోను మరిచిపోని మెమరీనివ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవనిదేదైనా చాయిస్ లో పోనివ్వు
ఒక్కొక్క దండానికి ఒక్కొ మార్కు పడనివ్వు
ఏ టెంషన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు
ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివ్వు
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
తల స్నానం చెయ్యకుండ పూజించానంటూ
నా వైపు కోపంగా చూస్తే ఒట్టు
షాంపుతో పాటే చదివింది తుర్రు మంటూ
వాష్ అయిపోతుందని నా సెంటిమెంటు
తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు
మీరు తలుచుకుంటే మా తలరాతలు తారు మారు
భారతం రాసిన చేతితో బతుకును దిద్దేయి బంగారు
పేపర్లో ఫోటోలు ర్యాంకులెవ్వరడిగారు
పాసు మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు తిరు తిరు తిరు తిరు గణనాద ది ది ది తై...
- తిరు తిరు గణనాద ది ది ది తై
100% Love
Movie More SongsThiru Thiru Gananadha Keyword Tags
-
-
-