MovieGQ

Diyalo Diyala

100% Love (2011) · Track 4 of 10 · 6:30

Song Details

Lyrics

ఆ ముద్దుల మువ్వారావు గారి పెద్దమ్మాయి పద్దెనిమిదో ఏట పైటేసుకుందంట కోరస్: డియాలో డియాల చిన్నవీధి చెక్కర చిట్టెమ్మగారి చిన్నకోడలు నలబైయ్యో ఏట నీళ్ళోసుకుందంట కోరస్: డియాలో డియాల రంగుల రాజారావు గారి మూడో అమ్మాయి పక్కింటి పుల్లారావు గారి నాల్గో అబ్బాయితో జంపు జిలానీ అంటా కోరస్: డియాలో డియాల ఇంక మన మెరకింటి మంగతాయారు గాజుల చిట్టెమ్మ దుబాయ్ సత్యవతి ఆల్లాల్ల మొగుల్ని వదిలేసారంటా కోరస్: డియాలో డియాల ఆళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను గానీ అల నోటితో ఆళ్ళే చెప్పుకుంటారంటా కోరస్: డియాలో డియాల మొదలెట్టవే మంగతాయారు అద్దురూపాయి ఇచ్చాడో అద్దం కొనుక్కోమన్నాడో కోరస్: డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో ఒక్కరుపాయి ఇచ్చాడో స్టిక్కర్ కొనుక్కోమన్నాడో కోరస్: డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో రెండు రుపాయిలిచ్చాడో రిబ్బను కొనుక్కోమన్నాడో కోరస్: డియాలో డియాల మూడు రుపాయలిచ్చాడో ముక్కెర కొనుక్కోమన్నాడో కోరస్: డియాలో డియాల పది రుపాయలిచ్చీ పాండ్స్ పౌడరు కొనుక్కోమన్నాడో నలభై రుపాయలిచ్చీ నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడో అన్నీ కొనిచ్చీ అలంకరించీ ఐదు లక్షలకు బేరంపెట్టీ అసలేని పసలేని ముసలోడికి నన్నమ్మేసాడు పిల్లా నీ బావనిస్తవా తొలికెల్లి తెల్లారి తీసుకొస్తను కోరస్: యాలో డియ్యాలో పిల్లా నీ బావనిస్తవా ఏడి కాస్తా చల్లారబెట్టుకొస్తను కోరస్: యాలో డియ్యాలో అమ్మో నా బావనిస్తనా జూనియర్ షారుక్ ని జారనిస్తనా అమ్మో నా బావనిస్తనా ఇంకో కాజోల్ ని చావనిస్తనా మెరకింటి మంగతాయారు మీముందు మిలమిల మెరిసిపోయింది గాజుల చిట్టెమ్మ మీముందుకు గలగల వచ్చేత్తందోయ్ గజ్జెల చప్పుడు విన్నడా ఎక్కడికెల్లావు అంటాడు కోరస్: డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో గాజుల ఊపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు కోరస్: డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో పక్కింటోడికి పొలమారిందా నువ్వే తలిసావంటాడు కోరస్: డియాలో డియాల పొరిగింటోడికి జ్వరమొచ్చిందా నీపై దిగులని అంటాడు కోరస్: డియాలో డియాల దోమకుట్టిందన్నానా...!! ఆడా మగా అంటాడు... పోని చీమ కుట్టిందన్నానా... చిన్నా పెద్దా అంటాడు వాడికి వీడికి లింకులు పెట్టీ ఉన్నవి లేనివి రంకులు కట్టీ శీలానికి సంకెళ్ళేసి చిలకే కొట్టని జాంపండయ్యానూ అయ్యో పాపం పిల్లా నీ బావనిస్తవా ఒక్కసారి సాటుకెల్లి లేటుకొస్తను కోరస్: యాలో డియ్యాలో పిల్లా నీ బావనిస్తవా నా మొగుడుకున్న డౌటులన్నీ రైటు చేస్తను కోరస్: యాలో డియ్యాలో అమ్మో నా బావనిస్తనా అంతగొప్ప లక్కు నీకు దక్కనిస్తనా అమ్మో నా బావనిస్తనా వాడికున్న తిక్కనీకు ఎక్కనిస్తనా అరే జరగండి జరగండి జరగండి జర దూసుకుంటూ వచ్చేస్తుంది దుబాయ్ సత్యవతే దుడ్డు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు కోరస్: డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో ఫ్రిజ్ టీవీ కొంటానే పైసల్ పంపియ్ మన్నాడు కోరస్: డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో సోఫాసెట్టు కొంటానే సొమ్ములు పంపియ్ మన్నాడు కోరస్: డియాలో డియాల డబుల్కాట్ కొంటానే డబ్బులు పంపియ్ మన్నాడు కోరస్: డియాలో డియాల ఇయన్ని పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు ఈస్ట్ ఫేసులో కొంటానే ఇంకా పంపియ్ మన్నాడు సోలిడ్ గా సెటిల్ అయ్యామంటూ బోలెడు ఆశల్తో ఫ్లైటే దిగితే ఈస్ట్ ఫేసు ఇంటిలోన డబుల్కాట్ బెడ్డు పైన సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను తుస్... పిల్లా నీ బావనిస్తవా హప్ షర్టు సెట్ సేసి తీసుకొస్తను కోరస్: యాలో డియ్యాలో పిల్లా నీ బావనిస్తవా దుబాయ్ సెంట్ బుడ్డిలోన ముంచుకొస్తనూ... కోరస్: యాలో డియ్యాలో అరె అమ్మో నా బావనిస్తనా ఆయిల్ బావిలోన దూకనిస్తనా అమ్మో నా బావనిస్తనా వీడి జిడ్డు నీకు అంటనిస్తనా ఓరి ఓరి ఓరి ఓరి ఓరి ఈ ముగ్గురి కదలైతే నాకు తెలుసుకానీ ఇదెవరో కొత్త దంటర్రా బాబు రయ్యామంటు గుద్దుకుంటొచ్చేస్తంది ఇలియనాకే ఈర్ష్య పుట్టే నడుమే నాదని అన్నాడు కోరస్: డియాలో డియాల ముమైత్ ఖాన్ కి ధమాక్ తిరిగే ఉడుకే నాదని అన్నాడు కోరస్: డియాలో డియాల శ్రేయకే చెమట్లు పుట్టే సోకే నాదని అన్నాడు కోరస్: డియాలో డియాల అనుష్కా నే యెనక్కి నెట్టే సరుకే నాదని అన్నాడు కోరస్: డియాలో డియాల ఫ్రంట్ బ్యాక్ చూసాడు మెంటలెక్కి పోయాడు అప్ డౌన్ చూసాడు అప్పడం అయి పోయాడు పేస్ చూసీ... ఆ... పేస్ చూసి హే పేస్ చూసి ఫ్రీజై పోయి పార్టులు మొత్తం లూజైపోయి పాపకి నేను సరిపోనంటు పారిపోయాడు అబ్బో అంత గొప్ప ఫేసా జర మాక్కూడా చూపించరాదే పిల్లా నీ బావనిస్తవా కంటి చూపుతోనే చప్పరిస్తను కోరస్: యాలో డియ్యాలో పిల్లా నీ బావనిస్తవా నోటి మాటతోనే నంజుకుంటనూ కోరస్: యాలో డియ్యాలో ఓకే నా బావనిస్తనూ జూనియర్ షారుక్ ని జంట చేస్తనూ నీకే నా బావనిస్తనూ ఇంత అందగత్తెగాడు లేదంటాను పిల్లా నీ బావ నివ్వకు నమ్ముకున్న తొడునెపుడు వీడనివ్వకు కోరస్: యాలో డియ్యాలో పిల్లా నీ బావ నివ్వకు జీవితాన్ని మోడులాగా మారనివ్వకు కోరస్: యాలో డియ్యాలో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from 100% Love

See All