Sannajaaji Puvva
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Sadhana Sargam
Lyrics
- సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
నీ చిరు చిరు నగవుల కిల కిల సడితో
వలపుల పాటలు పాడవా..
వలపుల తెలుగుల తొలి పిలుపులలో
చెలిమికి నా మది చూపవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
నీ చిరు చిరు నగవుల కిల కిల సడితో
వలపుల పాటలు పాడవా..
వలపుల తెలుగుల తొలి పిలుపులలో
చెలిమికి నా మది చూపవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
చరణం: 1
ఏతోటలో ఏ కొమ్మకో తారల్లె విరిసిన పువ్వా...
నాలో కోరిక వినవా తన సిగలో జాబిలి కావా
వేసంగిలో వెన్నెల్లలో గువ్వల్లె మెరిసిన పువ్వా...
నాలా నువ్వై పోవా తన ఒడిలో పాపవు కావా
పసి పసి మనసుల మొరలను వినవా
మధురిమ మంత్రం వేయవా
మా పరుగుల ఉరుకుల ప్రేమల త్రోవ
పరిమళ భరితం చేయవా
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
చరణం: 2
ముత్యానికే ముస్తాబులా తెల్లంగ పూచిన పువ్వా
నాతో ఏకం కావా తన పదముల పూజకు రావా
గోదారికే పైటంచులా స్వచ్చంగ విచ్చిన పువ్వా
నాలో సిగ్గులు కనవా నా తేనెలు తనకందీవా
ఇటు అటు తెలియని వయసుల గొడవా
ఇదియని నువ్వే తేల్చవా
మా ఇరువురి నడుమన వారధి కావా
ఈ ఒక సాయం చేయవా
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
Yuvarathna
Movie More SongsSannajaaji Puvva Keyword Tags
-
-