MovieGQ

Preyasi Kaavu

Vennela (2005) · Track 1 of 8

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ప్రేయసి కావు నేస్తం కావు గుండెల్లో నిండున్నావు గుప్పెట్లో దాగున్నావు చీకట్లో వెలుగిస్తావు జగమంతా కనిపిస్తావు పండుగ నీవు నా పచ్చిక నీవు (2) చరణం: 1 మోహమే మంటగా రగులుతున్నా లోకమే నీవుగా మునిగివున్నా గాలిలో ఈ కల తేలుతున్నా నీటిలో రాతలా చెదిరివున్నా నీ శ్వాసకోసం మానై ఉంటా నీ మాటకోసం మునినై పోతా నీ చూపు కోసం శిలనై ఉంటా నీ నవ్వుకోసం అలుసై పోతా జాబిలికే వెన్నెల నీవు సూర్యునికే వేకువ నీవు ఊపిరిలో ఉష్ణం నీవు ఊరించే తృష్ణం నీవు శూన్యం నీవు నా శోకం నీవు (2) చరణం: 2 వేసవి వర్షమై కురిసిపోవా వెచ్చని వేకువై వెలిగిరావా మాటతో రూపమై తరలిరావా నిర్ణయం చెప్పి నన్నాదుకోవా నీ తోడుకోసం ఆవిరైపోనా నీ స్పర్శకోసం చినుకై రానా నీ అడుగు తాకి గుడినైపోనా నీ గుండెలోకి సడినై రానా నీలానికి నింగివి నీవు కాలానికి గమ్యం నీవు చలనానికి శక్తివి నీవు భావానికి మూలం నీవు ఎవ్వరి కోసం ఈ జాబిలి వేషం కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం ఎవ్వరి కోసం ఈ జాబిలి వేషం కమ్మని కావ్యం ఈ వెన్నెల దీపం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vennela

See All