Pedavi Datani Matokatundi
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Ramana Gogula
Lyrics
- పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా హే హే హే
అడుగుతావని ఆశగా ఉంది
అడగవే త్వరగా లలలలలా
అడగరానిది ఏమిటి ఉంది
తెలుపవా సరిగా హో హో హో
మనసు చాటున ఎందుకు ఉంది
తెరలు తీ త్వరగా లల లల లా
చరణం: 1
మనసు నిన్నే తలచుకుంటోంది
వినపడదా దాని గొడవ
తలచుకునే అలసిపోతోందా
కలుసుకునే చొరవ లేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్ళిలా ఎలాగ మరి
అందాల సిరి ఒళ్ళొ ఇలా
వచ్చేస్తే సరి హే హే హే
పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా హే హే హే
అడుగుతావని ఆశగా ఉంది
అడగవే త్వరగా
చరణం: 2
ఇదిగిదిగో కళ్ళలో చూడు
కనపడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు
నీ వరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్ళిలా
చిలిపి కల
బాగుందిగాని నీ కోరిక
కలైతే ఏలా హే హే హే
పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా హే హే హే
అడుగుతావని ఆశగా ఉంది
అడగవే త్వరగా లలలలలా
హే కోయిలా... ఓ కోయిలా... (4)
Thammudu
Movie More SongsPedavi Datani Matokatundi Keyword Tags
-
-