Song Details
Lyrics
గెలుపు తలుపులే తీసే ఆకాశమేనేడు నాకోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే వీడదీబంధమే ఎటువైపుకు వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా మెరిసావే రంగుల్లోనా కలతీరే సమయాన అల నేనై లేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా దారులన్ని నాతో పాటుగా ఊయలూగి పాటేపాడగా నను వీడి కదలదు కాల మొక క్షణమైనా గెలుపు తలుపులే తీసే ఆకాశమేనేడు నాకోసమే ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై చేరెలే సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా చుక్కలలో చేరి చూడగా ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కులన్ని మీటివీణగా చెలరేగి కదిలెను గాలి తరగలె పైన గెలుపు తలుపులే తీసే ఆకాశమేనేడు నాకోసమే అలుపేరాదు అంటూ కొలిచా నింగి అంచులనే జగమే ఏలుకుంటూ పరిచా కోటికాంతులే ఇవ్వాళ గుండెలో ఇలా చల్లారిపోని శ్వాసలా కమ్మేసుకుంది నీ కల ఇన్నాళ్ళు లేని లోటులా తెల్లారిపోని రేయిలా నన్నళ్లుకుంటే నువ్వలా నను నేను గెలిచిన ఒంటరిగ నిలిచానే గెలుపు తలుపులే తీసే ఆకాశమేనేడు నాకోసమే
Lyrics sourced from public databases. May contain errors.