Song Details
Lyrics
సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి (2) సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా చరణం: 1 విరజాజి పూల బంతి అర చేత మోయలేని సుకుమారి ఈ సిన్నదేనా శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు సూసి అలకలొచ్చిన కలికి ఏసినది కులుకుల మెలికి చరణం: 2 సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న(2) సిలకమ్మ కొన సూపు సౌరు బొండు మల్లె చెండు జోరు సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు(2) మెరిసే నల్ల మబ్బైనాది వలపు జల్లు వరదైనాది
Lyrics sourced from public databases. May contain errors.