MovieGQ

Oohavo Oopirivo

Suvarna Sundari (1985) · Track 6 of 11

Lyrics

పల్లవి: ఊహవో... ఊపిరివో... నా జీవన రసమాధురివో ఊహవో... ఊపిరివో... నా జీవన రసమాధురివో వివర్ణమైన ఆశల ముంగిట... సువర్ణ సుందరివో ఇదే నా స్వాగతం... నీవే నా జీవితం ఊహవో... ఊపిరివో... నా జీవన రసమాధురివో వివర్ణమైన ఆశల ముంగిట... సువర్ణ సుందరివో ఇదే నా స్వాగతం... నీవే నా జీవితం చరణం: 1 చీకటి తీవెల రాతిరి వీణియ నవ్విన వేకువ చూపులని ఆమని తేనెల వాగుల పొంగిన తీయని అలలే మాటలని కంకణముల సడి పాటలుగా కలికి అందియల ఆటలుగా ఎడదల చప్పుడు తాళముగా విడుదల ఎరుగని కౌగిలిలో... కనుపాపలు తానాలాడే ఆషాడపు అభిషేకంలో ఏడుజన్మలిటు... ఆరు ఋతువులై నూరు శరత్తులు విరిసిన వేళ.... ఉదయరేఖ నుదుటదిద్ది.... కదలిరావే నా సుందరి ఓ నా ఉషస్సుందరి..... ఊహవో... ఊపిరివో... నా జీవన రస మాధురివో చరణం: 2 వెన్నెలసణిగే వెండిమువ్వలో సన్నని లయ నా హృదయమని... కిన్నెర పలికే చిలిపి ముద్దులో చల్లని శృతి నా ప్రణయమని... గగన నీలిమలు కురులుగా... ఉదయరక్తిమలు పెదవులుగా... హరిత చైత్రములు చీరెలుగా... శరణ్మెఘముల నడకలలో.. నిన్ను తాకిన హేమంతములో... సుడిరేగిన సంగీతంలో... సప్తవర్ణములు సప్తస్వరాలై సప్తపదులు నడిపించిన వేళా... కలలు వీడి.. ఇలకు చేరి కలిసిపొవె నా సుందరి... ఇంద్రధనుస్సుందరీ.... ఊహవో... ఊపిరివో... నా జీవన రసమాధురివో వివర్ణమైన ఆశల ముంగిట... సువర్ణ సుందరివో ఇదే నా స్వాగతం... నీవే నా జీవితం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Suvarna Sundari

See All