MovieGQ

Singaraya Konda

Suprabatham (1998) · Track 5 of 6

Lyrics

సింగరాయ కొండ ఈ చిన్నోడిది ఆకు పచ్చ జండా ఈ అందానిది నీ చూపులోనే చిత్తూరు ఉంది నీ కొంగు లోనే ఒంగోలు ఉంది ప్యాకేజిలోన ఉన్న మనసు నీకయ్యింది మ్యారేజి దాక ఆగనంటు దూకేస్తుంది సింగరాయ కొండ ఈ చిన్నోడిది ఆకు పచ్చ జండా ఈ అందానిది బందరు నుంచి బాజాలొచ్చి మోగించాలి పెళ్లి పాటలు అత్తిలి నుంచి అతిధులు వచ్చి అందించాలి శుభాకాంక్షలు గుంతకల్లు పొలిమేర దాకా బంతిపూలు చల్లాలంటా తాడేపల్లి నడిబొడ్డుదాకా తోరణాలు కట్టాలంటా అహ లక్షల కొద్ది అక్షింతలు పడగా ఒహొ లెక్కకు మించి కానుకలేరాగ ఎంతో ఇదిగా పెళ్లి జరగాలి ఏమి ముహూర్తం తెల్లబోవాలి సింగరాయ కొండ ఈ చిన్నోడిది ఆకు పచ్చ జండా ఈ అందానిది అరకువేలిలో చెరకుపొదల్లో పరిచెయ్యాలి పట్టెమంచము పాపి కొండల్లో పండు వెన్నెల్లో జరిపించాలి జంట యుద్ధము జన్మభూమి శ్రమదానమల్లే శోభనాలు సాగాలంట కొరకురాయి కంప్యూటరల్లే కాపురాలే చెయ్యాలంటా అహ వారంలోగ వేసెయ్యి పాగా ఒహో సూపర్ ఫాస్ట్ సీమంతం కాగా రెండను మాటే మూడు కావాలి మళ్ళి మళ్ళి మూడు రావాలి సింగరాయ కొండ ఈ చిన్నోడిది ఆకు పచ్చ జండా ఈ అందానిది నీ చూపులోనే చిత్తూరు ఉంది నీ కొంగు లోనే ఒంగోలు ఉంది ప్యాకేజిలోన ఉన్న మనసు నీకయ్యింది మ్యారేజి దాక ఆగనంటు దూకేస్తుంది సింగరాయ కొండ ఈ చిన్నోడిది ఆకు పచ్చ జండా ఈ అందానిది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Suprabatham

See All