MovieGQ

Prema Modhalaithe

Suprabatham (1998) · Track 4 of 6

Lyrics

ప్రేమ మొదలైతే హృదయంలో ఏదో కొత్త సుప్రభాత సూచన ఏమైందంటే తెలిసేనా లోలో కలిగే చెప్పలేని యాతన ఏం చేస్తూ ఉన్నా ఏదో ఒక లోపం ఏం చూస్తూ ఉన్నా ఒకటే ఒక రూపం మనసిక మన అదుపున ఉండదు ఎంత ఆపిన ప్రేమ మొదలైతే హృదయంలో ఏదో కొత్త సుప్రభాత సూచన ఉన్నపాటుగా ఎదురు పడ్డది పేరు అడిగితే ప్రేమ అన్నది మూగ బాషలే నేర్పుతున్నది కొత్తదారిలో నడుపుతున్నది ఇన్నాళ్లు ఎక్కడ దాగుందో గుండెల్లో ఎప్పుడు చేరిందో కళ్ళేమో తెరిచే ఉన్నా కలలెన్నో చూస్తూ ఉన్నా కాలేదే ఒక పూటైనా ఈలోగా వింతలు ఇన్నా తెలిసి తెలిసి వలపుల వలలో పడిపోతున్నా ప్రేమ మొదలైతే హృదయంలో ఏదో కొత్త సుప్రభాత సూచన పుస్తకాలలో చదువుకున్నది మెదడు నుంచి నా మదికి దిగినది నన్ను నన్నుగా ఉంచనన్నది నీకు నీడగా ఉండమన్నది ఆణువణువూ నిన్నే నింపిందో... నాలోనే నేనుండే చోటేదో మెరుపులనే దారం చేసి తారలతో పూలను గుచ్చి నా మెడలో హారం వేసి దురాన్నే దూరం చేసి నిన్ను నన్ను ఏకం చేసే బంధం ప్రేమ ప్రేమ మొదలైతే హృదయంలో ఏదో కొత్త సుప్రభాత సూచన ఏమైందంటే తెలిసేనా లోలో కలిగే చెప్పలేని యాతన ఏం చేస్తూ ఉన్నా ఏదో ఒక లోపం ఏం చూస్తూ ఉన్నా ఒకటే ఒక రూపం మనసిక మన అదుపున ఉండదు ఎంత ఆపిన ప్రేమ మొదలైతే హృదయంలో ఏదో కొత్త సుప్రభాత సూచన

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Suprabatham

See All