Song Details
Lyrics
ఓ ప్రియా వసుందర - ప్రియా ప్రియా ప్రేమనే వరించిరా - ప్రియా ప్రియా ఓ ప్రియా మనోహర - ప్రియా ప్రియా స్వాగతం స్వయంవర - ప్రియా ప్రియా మనిషి కన్న ముందర మనసు చేసే తొందర కనుల గడప దాటుతూ స్వప్నమెదుట పడెనురా కలలలోని కలికి తార చిలుకుతోంది కాంతిధార ఓ ప్రియా వసుందర - ప్రియా ప్రియా ఓ ప్రియా మనోహర - ప్రియా ప్రియా అరవిరిసిన కన్నులే మీటుతున్నవి అరమరికలు వద్దని చాటుతున్నవి తెరమరుగులు ఇప్పుడే తొలగుతున్నవి మన మనసుకి రెక్కలే తొడుగుతున్నవి నా మిణుకు మిణుకు ఆశలే నిజమయ్యేలా నీ వెలుగు తగిలి లోకమే మారె ఈవేళ నీ చిలిపి కనుల గూటిలో నేనే ఉండేలా నా బ్రతుకు జతగ చేయగా వచ్చా గోపాలా కౌగిల్ల సంకెళ్లు వేయన నిన్ను శృంగార ఖైదీగచెయ్యన ఈ శిక్ష చాలంటు చాటన ఒప్పుకుంటాను ఈ తీపి దండన అలక తీరి అసలు దారి తెలిసి నడిచె రాకుమారి ఓ ప్రియా మనోహర - ప్రియా ప్రియా ప్రేమనే వరించిరా - ప్రియా ప్రియా రెప రెప మని రెప్పలే విప్పుకున్నవి తపనల ఎద తాళమే తప్పుతున్నది ఎపుడెపుడని ఆత్రమే అడుగుతున్నది అపుడిపుడని వాయిదా వేయనన్నది నా దొరకు దొరుకుతున్నవి నాలో సింగారం ఇక తరిగి కరుగు తున్నవి ఇన్నాళ్ల దూరం ఈ కళికి కులుకు కదలికే కన్యాకుమారం నా ఉడుకు దుడుకు గుండెలో మోగే అలారం క్రిష్ణయ్య తీరున్న రాముడు సిగ్గు గిలుక్కు పెట్టాడు వీరుడు కాలాలు కనిపెట్టి కాముడే తన కనికట్టు చూపాడు భీముడే ముంచుతున్న మంచు కరిగి పొద్దు పొడుపు వెలుగు తాకె ఓ ప్రియా వసుందర - ప్రియా ప్రియా ప్రేమనే వరించిరా - ప్రియా ప్రియా ఓ ప్రియా మనోహర - ప్రియా ప్రియా స్వాగతం స్వయంవర - ప్రియా ప్రియా మనిషి కన్న ముందర మనసు చేసే తొందర కనుల గడప దాటుతు స్వప్నమెదుట పడెనురా కనులలోని కలికి తార చిలుకుతోంది ప్రేమధార ఓ ప్రియా వసుందర - ప్రియా ప్రియా స్వాగతం స్వయంవర - ప్రియా ప్రియా
Lyrics sourced from public databases. May contain errors.