Song Details
Lyrics
తననం తననం తననం గమప మపని దనిసా..... సనిదప సనిదప దపగరి దపగరి సనిద నిదప దపగ పగరిస సా పా గరి సా సా సా సా సా రీ రీ రీ రీ గా గా గా గా పా పా పా పా సరిగమపదని స్వరధార రస సాగర యాత్రకు ధృవతార సరిగమపదని స్వరధార రస సాగర యాత్రకు ధృవతార వీణవై... వేణువై... మువ్వవై... వర్ణమై... వీణవై జాణవై వేణువై వెలధివై మువ్వవై ముదితవై వర్ణమై నా స్వర్ణమై నెలవంక పల్లకిలొ ఇలవంక దిగిరావె సరిగమపదని స్వరధార రస సాగర యాత్రకు ధృవతార నెలవంక పల్లకిలొ ఇల్లవంక దిగిరావె సరిగమపదని స్వరధార రస సాగర యాత్రకు ధృవతారా చరణం: 1 అరుణం అరుణం ఒక చీరా.... అంబరనీలం ఒక చీరా అరుణం అరుణం ఒక చీరా... అంబరనీలం ఒక చీరా మందారంలో మల్లికలా ఆకాశంలో చంద్రికలా అందాలన్నీ అందియలై శృంగారంలో నీలయలై అందాలన్నీ అందియలై శృంగారంలో నీలయలై అలుముకున్న భూతావిలా అలవికాని పులకింతలా హిందోళ రాగ గంధాలు నీకు ఆందోళికా సేవగా ఆ.... సరిగమపదని స్వరధార రస సాగర యాత్రకు ధృవతార నెలవంక పల్లకిలొ ఇలవంక దిగిరావె సరిగమపదని స్వరధార రస సాగర యాత్రకు ధృవతార చరణం: 2 హరితం హరితం ఒక చీరా... హంసల వర్ణం ఒక చీరా హరితం హరితం ఒక చీరా... హంసల వర్ణం ఒక చీరా శాద్వరాన హిమదీపికలా శరద్వేళ అభిసారికలా చరణాలన్నీ లాస్యాలై... నీ చరణానికి దాస్యాలై అష్టపదుల ఆలాపనే... సప్తపదుల సల్లాపమై పురివిప్పుకున్న పరువాల పైట సుదతినేవీవగా ఆ.... ఆ..... సరిగమపదని స్వరధార రస సాగర యాత్రకు ధృవతార నెలవంక పల్లకిలొ ఇలవంక దిగిరావె సరిగమపదని స్వరధార రస సాగర యాత్రకు ధృవతారా...
Lyrics sourced from public databases. May contain errors.