MovieGQ

Lipileni Kanti Baasa

Srivariki Premalekha (1984) · Track 3 of 6

Lyrics

లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ నీ కన్నుల కాటుక లేఖలలో నీ సొగసుల కవితా రేఖలలో ఇలా ఇలా చదవనీ నీ లేఖని ప్రణయ లేఖని బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ నీ కౌగిట బిగిసిన స్వాశలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ చరణం: 1 అమావాశ్య నిశిలో కోటి తారలున్న ఆకాశం వెదుకుతు ఉంది వేదన తానై విదియ నాటి జాబిలి కోసం వెలుగునీడలెన్నున్నా వెలగలేని ఆకాశం ఎదుగుతు ఉందీ వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ చరణం: 2 అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని నీ కంటికి పాపను నేనై నీ ఇంటికి వాకిలి నేనై గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను గడియైనా నీవులేక గడపలేక ఉన్నాను బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ నీ కౌగిట బిగిసిన స్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Srivariki Premalekha

See All