Song Details
Lyrics
వనమాలి వనమాలి వెళ్లనులే నిన్నొదిలి మరుమల్లి మరుమల్లి నీ మనసే నా మజిలీ గొంతెత్తే చిలకలు మొలకెత్తే వలపులు తలలెత్తే చైత్రములో తనువిప్పే వయసులు పురివిప్పే పెదవులు లయ తప్పే లాహిరిలో వనమాలి వనమాలి వెళ్లనులే నిన్నొదిలి ప్రేమ తపసు నన్నే గెలిచినదీ... ప్రణయ దనసు నాలో విరిగినదీ... ప్రేమ తపసు నన్నే గెలిచినది ప్రణయ దనసు నాలో విరిగినది గుండెల్లో గాఢంగా భాద్రపదం ఉసిరినిది కన్నుల్లో మౌనంగా మార్గశిరం మెరిసినది జతపడు బ్రతుకులు పలు ఋతువులు అతిథిలల్లే చేరినవి... వనమాలి వనమాలి వెళ్లనులే నిన్నొదిలి ఆకుపచ్చ ప్రాయం వణికినదీ... గోరువెచ్చ గేయం తొణికినదీ... ఆకుపచ్చ ప్రాయం వణికినది గోరువెచ్చ గేయం తొణికినది పరువంలో వేగంగా పాలకడలి పొంగినది మోహంలో మొత్తంగా పడుచు పడవ మునిగినది పరి పరి విధముల విరి శరములు మరుని మహిమ తెలిపినదీ... వనమాలి వనమాలి వెళ్లనులే నిన్నొదిలి మరుమల్లి మరుమల్లి నీ మనసే నా మజిలీ గొంతెత్తే చిలకలు మొలకెత్తే వలపులు తలలెత్తే చైత్రములో తనువిప్పే వయసులు పురివిప్పే పెదవులు లయ తప్పే లాహిరిలో
Lyrics sourced from public databases. May contain errors.