Song Details
Lyrics
అప్సరసా అప్సరసా అప్సరసా లిప్స్ రసాలందించావే మోహనుడా మన్మధుడా మధుప్రియుడా ముద్దు నిషా ముందుంచావే లక్కీ పెదవికి ఒక్కసారిగ దక్కెను కిక్కునిధి దిక్కేతోచక గుక్క తిరగక మధువు మనకు బందీ అప్సరసా అప్సరసా అప్సరసా లిప్స్ రసాలందించావే మోహనుడా మన్మధుడా మధుప్రియుడా ముద్దు నిషా ముందుంచావే వంద వెన్నముద్దలు వెయ్యి తేనె చుక్కలు హోయ్ వంద వెన్నముద్దలు వెయ్యి తేనె చుక్కలు ఒక్కచోటే చేరి ముద్దులాగా మారి నోటికందించాయి రుచులు మాటల్లో గోషుండదా యాసుండదా ప్రాసుండదా ముద్దుల్లో ఊపుండదా కైపుండదా తీపుండదా మొద్దుగ మారిన సోమరి పెదవికి ముద్దే వ్యాయామం అప్సరసా అప్సరసా అప్సరసా లిప్స్ రసాలందించావే మోహనుడా మన్మధుడా మధుప్రియుడా ముద్దు నిషా ముందుంచావే స్వర్గమెంత దూరమో మోక్షమెంత కష్టమో స్వర్గమెంత దూరమో మోక్షమెంత కష్టమో అనుకున్నా గాని స్వర్గమోక్షాలన్ని చెంత చేరేనొక్క ముద్దుతో కాయల్లో చేదుండదా తీపుండదా పులుపుండదా కిస్సుల్లో మత్తుండదా మాయుండదా హాయుండదా ఎంతో చిన్నది అయినా గొప్పది కమ్మని కిస్ చబ్ధం అప్సరసా అప్సరసా అప్సరసా లిప్స్ రసాలందించావే మోహనుడా మన్మధుడా మధుప్రియుడా ముద్దు నిషా ముందుంచావే లక్కీ పెదవికి ఒక్కసారిగ దక్కెను కిక్కునిధి దిక్కేతోచక గుక్క తిరగక మధువు మనకు బందీ
Lyrics sourced from public databases. May contain errors.