MovieGQ

Nee Pedhavulatho

Srimathi Vellostha (1998) · Track 5 of 6

Lyrics

నీ పెదవులతో మాటాడాలని పనిగట్టుకు వచ్చా నీ పదములతో ఆటాడాలని పరిగెత్తుకు వచ్చా సరి సరి పద మరి తగపడి తదుపరి సబ్జెక్ట్ ఇది అని చర్చిద్దాం అర్జంటుగ కథ కదిలిద్దాం కలిగే అవసరమేదైనా కలిసి తీర్చుకుందాం నీ పదములతో ఆటాడాలని పరిగెత్తుకు వచ్చా సూదంటు సుకుమారం హల్లో హల్లో అంటే ఎలా హలా మతి అటో ఇటో అవదా నీ కొంటె వ్యవహారం చలో చలో అంటె ఒళ్ళో మరి చెయ్ డిచ్చో డిచ్చో అనదా పొద్దుపోదు నిద్దరోదు ముద్దకూడ ముట్టనీదు ఈ అల్లరి హద్దులేదు ఆపలేదు ముద్దులాటకాపులేదు కానీమరీ మధన కథ మొదలవదా మనజత కనబడగా సబ్జెక్ట్ ఇది అని చర్చిద్దాం అర్జంటుగ కథ కదిలిద్దాం కలిగే అవసరమేదైనా కలిసి తీర్చుకుందాం నీ పెదవులతో మాటాడాలని పనిగట్టుకు వచ్చా నీ పదములతో ఆటాడాలని పరిగెత్తుకు వచ్చా నా సోకు ఫలహారం గిల్లి గిల్లి తిని తుళ్ళి కళ్ళి మహ అవస్థ పడిపోవా నాజూకు నయగారం ఇందా ఇందా అని విందే ఇస్తే కళ్ళు తథాస్తు అనుకోవా కుళుకులు అరగక కునుకిక కుదరక ఏం తిప్పలో కొరికిన కనులకు దొరికిన నడుముకు ఏం నొప్పులో సెగలెగసి సఖి సొగసి తగిలిన తికమకలో సబ్జెక్ట్ ఇది అని చర్చిద్దాం అర్జంటుగ కథ కదిలిద్దాం కలిగే అవసరమేదైనా కలిసి తీర్చుకుందాం నీ పెదవులతో మాటాడాలని పనిగట్టుకు వచ్చా నీ పదములతో ఆటాడాలని పరిగెత్తుకు వచ్చా సరి సరి పద మరి తగపడి తదుపరి సబ్జెక్ట్ ఇది అని చర్చిద్దాం అర్జంటుగ కథ కదిలిద్దాం కలిగే అవసరమేదైనా కలిసి తీర్చుకుందాం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Srimathi Vellostha

See All