MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Baba Sai Baba

Song

Music Director

Lyricist

Lyrics

  • Search Box
    Sri Shirdi Saibaba Mahathyam (1986)
    Palli Balakrishna Wednesday, August 23, 2017 1986 , Ilaiyaraaja , J.V. Somayajulu , Sri Shirdi Saibaba Mahathyam , Vijayachander


    చిత్రం: శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
    సంగీతం: ఇళయరాజా
    సాహిత్యం: ఆత్రేయ
    గానం: కేె. జె. యేసుదాసు
    నటీనటులు: విజయ్ చందర్, చంద్రమోహన్, జె. వి. సోమయాజులు, అంజలీ దేవి
    దర్శకత్వం: కె.వాసు
    నిర్మాతలు: గోగినేని ప్రసాద్, కె.బాబురావు
    విడుదల తేది: 1986

    హే... పాండురంగా
    హే... పండరి నాథా
    శరణం శరణం శరణం

    సాయీ శరణం బాబా శరణం శరణం
    సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
    ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
    మా పాండురంగడు కరుణామయుడు సాయే
    ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
    మా పాండురంగడు కరుణామయుడు సాయే

    సాయీ శరణం బాబా శరణం శరణం
    సాయీ చరణం గంగా యమున సంగమ సమానం

    విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై
    పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై
    తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై
    మహల్సా, శ్యామాకు మారుతి గాను మరి కొందరికి దత్తాత్రేయుడుగా
    యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేశాడు

    సాయీ శరణం బాబా శరణం శరణం
    సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
    ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
    మా పాండురంగడు కరుణామయుడు సాయే
    సాయీ శరణం బాబా శరణం శరణం
    సాయీ చరణం గంగా యమున సంగమ సమానం

    పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను
    ఆదరించె తాననాథ నాథుడై
    అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి
    అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
    వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను
    పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై
    పుచ్చుకున్న పాపములను ప్రక్షాళన చేసికొనెను
    దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై
    అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో
    ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై

    జీవరాశులన్నిటికి సాయే శరణం, సాయే శరణం
    దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం, సాయే శరణం
    ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం
    ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం
    భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం
    భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం

    సాయీ శరణం బాబా శరణం శరణం
    సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
    ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
    మా పాండురంగడు కరుణామయుడు సాయే
    ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
    మా పాండురంగడు కరుణామయుడు సాయే
    ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
    మా పాండురంగడు కరుణామయుడు సాయే





    ********* ********* *********




    చిత్రం: షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
    సంగీతం: ఇళయరాజా
    సాహిత్యం: ఆత్రేయ
    గానం: కేె. జె. యేసుదాసు

    మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా
    మమ్ము కరుణించి నావయ్యా
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
    మేము తరియించినామయ్యా

    మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా
    మమ్ము కరుణించి నావయ్యా
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
    మేము తరియించినామయ్యా

    పసి పాప మనసున్న ప్రతి మనిషి లోను పరమాత్ముడున్నాడని
    వాడు పరిశుద్ధుడవుతాడని
    గోలీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
    మమ్ము సాకావు మా సాయి
    వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్ని ఒకటంటివి
    నిన్ను పూజించ తగునంటివి
    మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి
    మాలో కలతల్ని మాపేస్తివి

    మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా
    మమ్ము కరుణించి నావయ్యా
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
    మేము తరియించినామయ్యా

    పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం
    ఇచ్చు మేలైన పై జన్మం
    రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ
    వారి బాధల్ని మోశావయా
    ఏనాడూ పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో
    నువ్వు ఎనాటి దైవానివో
    ఈ ద్వారకామాయి నీవాసమాయే ధన్యులమైనామయా
    మాకు దైవమై వెలిశావయా

    మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా
    మమ్ము కరుణించి నావయ్యా
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
    మేము తరియించినామయ్యా

    తరియించినామయ్యా మేము తరియించినామయ్యా
    తరియించినామయ్యా మేము తరియించినామయ్యా




    ********* ******** *********




    చిత్రం: శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
    సంగీతం: ఇళయరాజా
    సాహిత్యం: ఆత్రేయ
    గానం: యస్. పి. బాలు

    బాబా సాయి బాబా, బాబా సాయి బాబా
    నీవూ మావలె మనిషివని నీకూ మరణం ఉన్నదని
    అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బ్రతికేది

    బాబా సాయి బాబా, బాబా సాయి బాబా

    నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు (2)
    నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు
    తిరుగాడే కోవెల నీ దేహం శిధిలంగా అవుతుందా
    పిలిచినంతనే పలికే దైవం ముగై పోతాడా...

    బాబా సాయి బాబా, బాబా సాయి బాబా
    నీవూ మావలె మనిషివని నీకూ మరణం ఉన్నదని
    అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బ్రతికేది
    బాబా సాయి బాబా, బాబా... సాయి బాబా

    దివిలో వున్నా భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా
    దిక్కులలోన ఎక్కడ వున్నా ముక్కలు చెక్కలు చేసుకురా
    దివిలో వున్నా భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా
    దిక్కులలోన ఎక్కడ వున్నా ముక్కలు చెక్కలు చేసుకురా
    సూర్యచంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా
    గ్రహములు గోళాలిహపర శక్తులు గగ్గోలెత్తగ రావయ్యా
    నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం
    నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం
    లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోనీ
    ముల్లోకాలు కల్లోలంలో శూన్యం అయిపోనీ
    రగిలే కాలాగ్ని ఎగిసే బడబాగ్ని
    దైవం ధర్మాన్ని దగ్ధం చేసేనీ
    నేనే ఆత్మైతే నీవే పరమాత్మా
    నీలో నన్ను ఐక్యం ఐపొనీ పోనీ...

Baba Sai Baba Keyword Tags

  • Baba Sai Baba Song
  • Movie Sri Shirdi Saibaba Mahathyam Songs
  • Baba Sai Baba Song Music Director Composer
  • Details of Baba Sai Baba Song Wiki Information
  • Sri Shirdi Saibaba Mahathyam All Mp3 Songs
  • Lyrics for Baba Sai Baba Song
  • Baba Sai Baba Full Video Watch Online
  • Sri Shirdi Saibaba Mahathyam Movie Full Song
  • Baba Sai Baba Song from Sri Shirdi Saibaba Mahathyam Movie
  • Play Online Baba Sai Baba
  • Baba Sai Baba Song Vocal Singers
  • Music Director of Baba Sai Baba Songs
  • Baba Sai Baba Lyricists
  • Baba Sai Baba Movie Composer
  • Baba Sai Baba Videos from Sri Shirdi Saibaba Mahathyam Movie
  • Lyical Video of Baba Sai Baba
  • Baba Sai Baba Stream Online Music Links
  • Songs from Sri Shirdi Saibaba MahathyamMovie
  • Promo Videos of Baba Sai Baba
  • Baba Sai Baba English Lyrics