MovieGQ

Allah

Sri Ramadasu (2006) · Track 6 of 19

Song Details

Lyrics

అల్లా శ్రీ రామా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారుముద్దుగ అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమవ్ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య ముక్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాన నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి గణమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తి వునుగాని రస మూర్తి ఆ మూర్తి శ్రీ రామ చంద్ర మూర్తి తాగరా ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పా ప ప మ ప ని ప మ ప ని ప మ ప స ని ప మ ప మ శ్రీ రామ పా ప ప మ ప ని ని ప ని స స రి రి స ని ప మ ప ని మ ప మ కోదండ రామ మ ప ని స రి స ని ప ని ప మ సీతా రామ మ ప ని స రి స రి స రి మ రి స ని ప మ ఆనంద రామ మా మా రి మ రి మ రి స రి మ రామ జయ రామ స రి మ రామ స ప మ రామ పా వననామ ఏ వేల్పు యెల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకె వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు ద్యుతిగొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పుదె మల్పులేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసానుదాసులకు కై మోడ్పు తాగరా ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sri Ramadasu

See All