Song Details
Lyrics
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా ఆ...ఓ... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్నీ సొంత ఇల్లే అంతా అయినవాళ్ళే ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం బ్రతుకంతా ఇది తీరే ఋణమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అదే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వుంటే భయమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా ఆ...ఓ...
Lyrics sourced from public databases. May contain errors.