Song Details
Lyrics
పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలా తేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా ప్రేమంటే పామని బెదరాలా ధీమాగ తిరగర మగరాయడా భామంటె చూడని వ్రతమేలా పంతాలె చాలురా ప్రవరాఖ్యుడా మారనే మారవా మారమే మానవా మౌనివా మానువా తేల్చుకో మానవా పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలా తేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా చరణం: 1 చెలితీగకి ఆధారమై బంధమై అల్లుకో దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో నా వాలుజడ చుట్టుకొని మొగలిరేకా నడుము నడిపించుకో వయసులో పరవశం చూపుగా చేసుకో సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలా తేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా చరణం: 2 ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాగనై జత లీలలో అలసి మెత్తెక్కి పోనీ నిద్రగన్నేరునై నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమి చెంగల్వనై మోజులే జాజులై పూయనీ హాయినీ తాపమే తుమ్మెదై తీయనీ తేనెనీ పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలా తేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
Lyrics sourced from public databases. May contain errors.