Song Details
Lyrics
అవ్వాయి తువ్వాయీ అల్లాడే అమ్మాయీ అవ్వాయి తువ్వాయీ ఖిలాడీ అబ్బాయీ దాగీ దాగని సోకే బరువయీ ఆగీ ఆగని ఈడే ఇరుకయి తాకీ తాకని చూపే చినుకయీ దూకీ దూకని ఊపే వరదైయి ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో అయ్యో రామా అసలిదేం లడాయీ అవ్వాయి తువ్వాయీ అల్లాడే అమ్మాయీ పాలోసి పెంచా ప్రతి భంగిమా పోగేసి ఉంచా పురుషోత్తమా అమాంతం తెగిస్తే సమస్తం తమకేగా కంగారు పెట్టే సింగారమా బంగారమంతా భద్రం సుమా ప్రమాదం తెలిస్తే సరదాపడతావా ఎన్నాళ్లీ గాలిలో తిరుగుడు ఇలా నా ఒళ్లో స్థిరపడే దారిచూడు బాలమణీ సరే కానీ మరి పద చెల్లిస్తా ప్రతి బకాయీ అవ్వాయి తువ్వాయీ ఖిలాడీ అబ్బాయీ తెగ రెచ్చిపోకే పసి పిచ్చుకా నన్నాపలేదే నీ ఓపిక పిడుగై పడనా వ్రతమే చెడినాక చిర్రెత్తి వస్తే మగపుట్టుక సుకుమారమిస్తా సుఖపెట్టగా ఒడిలో పడనా వరమే అడిగాక కవ్వింతలెందుకే బాలికా మరీ పువ్వంటి సున్నితం కందిపోగా చిచ్చౌతావో నువ్వే చిత్తౌతావో ఎటూ తేలందే ఇదేం బడాయీ అవ్వాయి తువ్వాయీ ఖిలాడీ అబ్బాయీ దాగీ దాగని సోకే బరువయీ ఆగీ ఆగని ఈడే ఇరుకయి తాకీ తాకని చూపే చినుకయీ దూకీ దూకని ఊపే వరదైయి ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో అయ్యో రామా అసలిదేం లడాయీ
Lyrics sourced from public databases. May contain errors.