MovieGQ

Merise Thaaraladhi

Sirivennela (1986) · Track 7 of 10

Lyrics

మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం అది నా కంటికి శూన్యం మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా గానం పుట్టుక గాత్రం చూడాలా ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా గానం పుట్టుక గాత్రం చూడాలా వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి నాలో జీవన నాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన నీకే నా హృదయ నివేదన మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sirivennela

See All