Song Details
Lyrics
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకానా వీలు కాదు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకానా వీలు కాదు వంటిట్లో గారాలు ఒళ్ళంతా కారాలే సారు చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు విరజాజి పూలు వంటిట్లో వాడరాదు సూర్యుడే చుర చుర చూసినా చీరనే వదలడు చీకటే చెదిరినా కాకులే కేకలు వేసినా కౌగిలే వదలను వాకిలే పిలిచినా స్నానానికే సాయమే రావాలనే తగువా నీ చూపులే సోకుగా కావాలనే సరదా పాపిడి తీసి పౌదరు పూసి బైటికే పంపేయనా పైటతో పాటే లోనికిరానా పాపలా పారాడనా తియ్యగ తిడుతూనే లాలించనా సరసాలు చాలు శ్రీవారు తాన నాన విరహాల గోల ఇంకానా ఊహు ఊహు కొత్తగా కుదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకే చేరదా ఎందుకో తికమక తొందర బొత్తిగా కుదురుగ ఉండనే ఉండడా ఆరారగా చేరక తీరేదెలా గొడవా ఆరాటమే ఆగదా సాయంత్రమే పడదా మోహమే తీరే ఊతమే రాదా మోజులే చెల్లించవా జాబిలే రాడా జాజులే తేడా రాతిరే రాదా ఇక ఆగదే అందాక ఈడు గోల చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు విరజాజి పూలు వంటిట్లో వాడరాదు ఊరించే దూరాలు ఊ అంటే తియ్యంగ తీరు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
Lyrics sourced from public databases. May contain errors.