Sai Ante Thalli
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- పల్లవి:
సాయి అంటే తల్లి
బాబా అంటే తండ్రి
సాయి బాబా తోడేలేక
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము
నువ్వోస్తావన్న ఆశతో
బ్రతికొస్తావన్న ఆశతో
జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము
కోటి చుక్కలమయ్యాము
కన్నీటి చుక్కుల మయ్యాము
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము
చరణం: 1
బోథలు చేసేదెవరు మా బాధలు బాపేదెవరు
లీలలు చూపేదెవరు మాతో గోళీలాడే దెవరు
బోథలు చేసేదెవరు మాలో బాధలు బాపేదెవరు
లీలలు చూపేదెవరు మాతో గోళీలాడే దెవరు
పాటలు పాడేదెవరు మా పొరపాటులు దిద్దేదెవరు
పాటలు పాడేదెవరు మా పొరపాటులు దిద్దేదెవరు
తీయగ కసిరేదెవరూ...
తీయగ కసిరేదెవరు ఆపై ప్రేమను కొసరేదెవరు
సాయి... జీవం పోసే నువ్వే నిర్జీవుడవైనావా?
నువు కన్నులు తెరిచేదాకా మా కంటికి కునుకేరాదు
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము
చరణం: 2
మాకిచ్చిన నీ విబూదిని నీకూ కాస్త పూసేమయ్యా
లేవయ్యా సాయి లేవయ్యా
నీ చేతిచిన్నికర్రతో నిన్నే తట్టి లేపేమయ్య
లేవయ్యా బాబా లేవయ్యా
ఇన్నాళ్లు నువ్వడిగావు మానుండి భిక్షని
ఇన్నాళ్లు నువ్వడిగావు మానుండి భిక్షని
యివ్వాళ మేమడిగేము నీ ప్రాణ భిక్షని
నీ ప్రాణ భిక్షని
యిచ్చేవరకు ఆగలేము
యిచ్చేవరకు ఆగలేము
నువ్వొచ్చేవరకు వూరుకోము
వచ్చే వరకు వూరుకోము
పచ్చి మంచినీరైనా తాకబోము
సాయి అంటే తల్లి
బాబా అంటే తండ్రి
సాయి బాబా నీ తోడేలేక
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి (13)
Shiridi Sai
Movie More SongsSai Ante Thalli Keyword Tags
-
-