Okkade Devudu
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Nagarjuna Akkineni
Lyrics
- సబ్ కా మాలిక్ ఏక్ హై
ఒక్కడే సూర్యుడు
ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు
రాముడే దేవుడని కొలించింది మీరు
ఏసునే దైవమనీ తలచింది మీరు
అల్లా అని ఎలుగెత్తి పిలించింది మీరూ
ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా
ఏ తీరుగా ఎవరు పూజించినా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
కాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ గలగలలను హిందూమతమన్నావు నీవు
ఆకుపచ్చ కేతనాన చంద్రవంక తళతళలను ఇస్లాము అన్నావు నీవు
శిలువపైన ఏసు రక్త కన్నీళ్ళతొ ఎదను తడిసి క్రైస్తవమని అన్నావు నీవు
బౌద్ధమని జైన మని సిక్కు అని ఒప్పుకునే పలు గుండెల పలుగొంతుల పలుకేదైనా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
రాజు పేద బేధమెపుడు చూపబోదు గాలీ
అది దేవదేవునీ జాలీ...
పసిడి మేడనీ పూరి గుడిసనీ బేధమెరిగి కురియబోదు వానా
అది లోకేశ్వరేశ్వరుని కరుణా
సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువు దీరి ఉన్నాడు ఆ స్వయంభువుడు
కులం అని మతం అని జాతులని భ్రాంతి విడు
ప్రతి అణువున తన రూపమె ప్రతిబింబముగా
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతి రూపముగా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు
Shiridi Sai
Movie More SongsOkkade Devudu Keyword Tags
-
-