Datthatreyuni
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Sonu NigamTeesha Nigam
Lyrics
- దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం
దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం
అలా ఒకనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది
పరమ పతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగింది
బ్రహ్మ మానస పుత్రుడైన ఆ అత్రి మహాముని పత్ని
అనసూయ పరమసాధ్వి అని పలికెను ఉమాపతి
అది విని రగిలిన ముగురమ్మలు అసూయా జలధిని మునిగి
అనసూయనే పరీక్షింపగా తమ తమ పతులను పంపిరి
దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం
అతిధి రూపములు దాల్చిన మువ్వురు మూర్తులనాసతి కొలిచినది
దిగంబరముగా వడ్డింపమనిన దిక్పతులను చూసి
దిగ్ర్బాంతి చెందినది
కాలమూర్తులను చంటి పాపలుగ మార్చి వివస్త్రగ వెలిగినది
పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించినది
పతులు పసిపాపలైరని తెలిసి లక్ష్మీ సరస్వతి పార్వతులు పరితపించిరి
గొల్లుమనుచూ పతిభిక్ష పెట్టమని కొంగుచాచి యాచించిరి
అనసూయ పాతివ్రత్యంతో పాలకులోకటిగ బాసిల్లిరి
తమ తమ పతులెవరో తెలియక ముగ్గురమ్మలే మొరడిలిరి
ముగురు మూర్తులను ముగ్గురమ్మలకు ఇచ్చి అనసూయ అత్తయైనది
బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశ అత్రిముని దత్తమైనది
అత్రిముని దత్తమైనది
దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం
సృష్టి స్థితి లయ కారకులౌ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు
ఒకే దేహమున వరలగా
అన్ని ధర్మముల ఆలవాలముగా ఆవు పృష్ఠమున అలరగా
నాల్గు వేదముల నడివడిగా నాల్గు శునకములు నానుడిగా
సమర్థ సద్గురు అంశమే ఆ దత్తుని ఐదు అంశములై
ధర వెలిగే ధర్మ జ్యోతులుగా
ధర వెలిగే ధర్మ జ్యోతులుగా
ధర వెలిగే ధర్మ జ్యోతులుగా
Shiridi Sai
Movie More SongsDatthatreyuni Keyword Tags
-
-