Nee Padamula
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు
సాయినాథ మహరాజ్ కీ జై
పల్లవి:
నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా
సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా
ఏ క్షేత్రమైనా తీర్థమైన నీవేగా
ఓ జీవమైనా భావమైన నీవేగా
నీవులేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
నీవులేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా
చరణం: 1
మనుజులలో దైవము నువ్వు
కోసల రాముడివై కనిపించావూ
గురి తప్పని భక్తిని పెంచావు
మారుతిగా అగుపించావూ
భక్త సులభుడవై కరుణించావూ
భోళా శంకరుడిగ దర్శనమిచ్చావు
ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయి
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
కృష్ణా... రాధాకృష్ణా హే కృష్ణా
తనువులన్ని నీవుకాచుకోలేనురా కృష్ణా
త్రోవచూపు తోడు నీవే కృష్ణా
తలపులన్ని నీవరనా పోలేమురా
తరలిపోని తావి నీవే కృష్ణా
జగదేక జ్ఞానమూర్తి వసుదైక ప్రాణకీర్తి
తరగపోని కాంతి నీవే నంద నందనా
నీవులేని చోటులేదు కృష్ణా
ఈ జగమంతా నీవేలే కృష్ణా
నీవులేని చోటులేదు కృష్ణా
ఈ జగమంతా నీవేలే కృష్ణా
- రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
Shiridi Sai
Movie More SongsNee Padamula Keyword Tags
-
-
-