Song Details
Lyrics
పల్లవి: కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా మరునిమిషంలో ప్రేమా కలతే రేపినా పూవే అందునా ముళ్ళనే దాటక ప్రేమే చేరునా మనసునే వేధించక ప్రతి కథలో ఇది సహజం పరులకిదే అపార్ధం చరణం: 1 కడలిని వీడి అడుగులు వేయవు అలలేనాడు నింగిని వీడి నిలబడగలదా వెన్నెల ఏనాడూ దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు ఓ దైవమా...ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా నా కన్నులలో కన్నీరేల తుడిచే నేస్తం కనపడదేలా చరణం: 2 హృదయంలో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగిందీ ఊహకు అందని ఉపద్రవమేదో నను బలి చేసింది కనులకు చూపై పెదవికి నవ్వై నను మురిపించింది ఆ కన్నులలోనే కన్నీరై కలవర పరిచింది ఓ నేస్తమా...ఓ నేస్తమా నాకన్నా నిన్నే మిన్నగ ప్రేమించా ప్రేమా అడుగే పడదు అలికిడి లేకా మరణంలోనూ నిను మరువను ఇంక
Lyrics sourced from public databases. May contain errors.