Song Details
Lyrics
దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా షాజహన్ తిరిగొచ్చినా తాజ్ మహల్ రాసిచ్చినా ఇప్పడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా లోలోన మనసంతా సంతోషమే ఈప్రేమ పులకింత సంతోషమే లోలోన మనసంతా సంతోషమే ఈప్రేమ పులకింత సంతోషమే చరణం: 1 వెన్నెల చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది ఈ దినం నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకసం ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని వాలకం ప్రేమొస్తే ఇంతేనేమో పాపం దాసోహం అంటుందేమో వంగి వంగి ఈ లోకం చరణం: 2 కోయిలా నేర్చుకోయిలా ఆమె నవ్వులో తేనే సంతకం హాయిగా పీల్చుకో ఇలా చల్లగాలిలో ఆమె పరిమళం నీటిపై చందమామలా నేడు తేలుతూవుంది నా మది చీటికి మాటి మాటికీ కొత్త కొత్తగా ఉంది ఏమది అణువంతే ఉంటుందమ్మ ప్రేమ... అణచాలి అనుకున్నామా చేస్తుందమ్మా హంగామా... దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా షాజహన్ తిరిగొచ్చినా తాజ్ మహల్ రాసిచ్చినా ఇప్పడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా లోలోన మనసంతా సంతోషమే ఈప్రేమ పులకింత సంతోషమే లోలోన మనసంతా సంతోషమే ఈప్రేమ పులకింత సంతోషమే
Lyrics sourced from public databases. May contain errors.