MovieGQ

Kori Kori Kaalutundi

Rowdy Alludu (1991) · Track 2 of 6

Lyrics

పల్లవి: కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో చరణం: 1 ప ని స గ స ని సా స గ మ ప మ గ మా కాగుతున్న కోరికంత కాగడాగ మారని కంటపడని కైపుకథల సంగతేదొ చూడని కౌగిలిలో నలిపి నలిపి చుక్కలనోడించని రాలుతున్న మల్లెలు గా పక్కపైన దించని గాజుల గలగలలు... విరజాజుల విలవిలలు కందిపోయి కాలమాగనీ... కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో... కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో చరణం: 2 ప ని ప ని సా ప ని ప ని సా స గ స గ మా స గ స గ మా కునుకేదీ కనపడదేం ఏమైందో ఏమో లోకాలను జోకొట్టే పనిలో ఉందేమో కొంగు విడిచిపెట్టని నా సిగ్గెటుపొయిందో జతపురుషుని చేరేందుకు సిగ్గుపడిందేమో ఊపిరి ఉప్పెనలో తొలిమత్తుల నిప్పులలో చందమామ నిదర చెదరని..హా... కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rowdy Alludu

See All