Song Details
Lyrics
పల్లవి: పసుపు తాడుకు ముడులు వేసి... బంధమంటే సరి పోదు ఏడూ అడుగులు నడిచినంతనే భార్య అంటే సరి కాదు... సరిపోదు... సరి కాదు పసుపు తాడుకు ముడులు వేసి... బంధమంటే సరి పోదు చరణం: 1 హృదయానికి హృదయం బంధం మరో హృదయానికి తెలియని అనుబంధం ఏ అడుగు వేయలేనిది... ఎదురేమీ అడగలేనిది తాడు లేనిదీ... ముడులు లేనిదీ తుడుచుకు పోనిది... తెంచుకు పోనిది ప్రేమకు మాంగల్యం... ప్రేమకు మాంగల్యం పసుపు తాడుకు ముడులు వేసి బంధమంటే సరి పోదు సరిపోదు.. సరి కాదు చరణం: 2 అనురాగానికర్ధం త్యాగం... అదే అసలైన ప్రేమకు నిర్వచనం మాటలకే అందనిది... మనసులకే అనుభవమైనదీ భాష లేనిది... భావన వున్నది.. జన్మకు సరిపోనిది... జన్మలకే అంకితమైనదీ ప్రేమకు మాంగల్యం... ప్రేమకు మాంగల్యం పసుపు తాడుకు ముడులు వేసి... బంధమంటే సరిపోదు ఏడూ అడుగులు నడిచినంతనే... భార్య అంటే సరి కాదు.. సరిపోదు.. సరి కాదు పసుపు తాడుకు ముడులు వేసి బంధమంటే సరి పోదు
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Raga Deepam
See AllNee Caru Number One
S.P. Balasubrahmanyam
Vayyaraniki
S.P. Balasubrahmanyam, P. Susheela
Thellavare Thellavare
P. Susheela, Prakash Rao
Kumkuma Pusina Aakasamlo
S.P. Balasubrahmanyam, P. Susheela
Adhigo Adhigo Adhigo Evaro Vasthunnaru
S.P. Balasubrahmanyam
Pasuputhaduku Mudulu Vesi
S.P. Balasubrahmanyam