Song Details
Lyrics
పల్లవి: అదిగో అదిగో అదిగో... ఎవరో వస్తున్నారు ఇదిగో ఇదిగో ఇదిగో... ఎవరో చూస్తున్నారు వచ్చేసై... వచ్చేసై... కాకులు దూరని కారడవుల్లో... చీమలు చేరని చిట్టడవుల్లో.. ప్రేమించుకొందామా... పెళ్ళాడి ఉందామా అదిగో అదిగో అదిగో... ఎవరో వస్తున్నారు ఇదిగో ఇదిగో ఇదిగో... ఎవరో చూస్తున్నారు చరణం: 1 నీలి నీలి ఆకాశం తెల్లబోయినా తెల్ల తెల్ల మబ్బులా ముఖం మారినా గాలిజోరు నిను వెనకకు లాగినా దుమ్ము ధూళి నీ కన్నులు మూసినా ముందు చూడక... వెనక చూడక లెక్క చేయక వచ్చేసై.. కమాన్...కమాన్ ఐసే కమాన్... వచ్చేసై కాకులు దూరని కారడవుల్లో చీమలు చేరని చిట్టడవుల్లో ప్రేమించుకొందామా... పెళ్ళాడి ఉందామా అదిగో అదిగో అదిగో... ఎవరో వస్తున్నారు ఇదిగో ఇదిగో ఇదిగో... ఎవరో చూస్తున్నారు చరణం: 2 ఉరిమి ఉరిమి మెరుపుల్లో... పిడుగురాలినా జడిసి జడిసి మేఘలే... నీరు కారినా జోరువాన నిను ముద్దగ చేసినా వరద పొంగు నిను ముంచి వేసినా ముందు చూడక... వెనక చూడక లెక్క చేయక వచ్చేసై.. కమాన్... ఐసే కమాన్... వచ్చేసై అదిగో అదిగో అదిగో... ఎవరో వస్తున్నారు ఇదిగో ఇదిగో ఇదిగో... ఎవరో చూస్తున్నారు కాకులు దూరని కారడవుల్లో చీమలు చేరని చిట్టడవుల్లో ప్రేమించుకొందామా... పెళ్ళాడి ఉందామా ప్రేమించుకొందామా... పెళ్ళాడి ఉందామా
Lyrics sourced from public databases. May contain errors.