Chamathi Poobanthi (Male)
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను
నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే
చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
నేలమ్మకు ఏదమ్మా బువ్వెట్టే వాళ్ళమ్మా
ఆకాశంకేదమ్మా ఆడిగిందిచ్చే తన అమ్మా
ఆ రాత నీ కేంటి నేనున్నా లోటేంటి
నీ తోడే నా లోకం తోడియ్యన నా ప్రాణం
అమృతాన్ని తాగి అమ్మలాగ రానా
అమృతాన్ని మించే అమ్మప్రేమ తేన
నీకంటే నా కెవరున్నారే నా చెళ్ళమ్మా
ననుగన్నా తల్లివి నువ్వమ్మా
చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
నీ నవ్వు చూడంగా ఉన్నాయి ఈ కళ్ళు
పువల్లే పెంచంగా ఉందమ్మా ఈ వళ్ళు
నీ కాలి చెప్పులుగా అరచేతులు ఇవిగోమ్మ
కలతంటూ రానీను కనులు చెమ్మ కానీను
గోరింటాకు నేనై నీ చేత పండుతాను
గోరువంక చెంత చిలక నిన్ను చేస్తాను
ప్రతి జన్మ నువ్వేలేవమ్మా నా చెల్లమ్మా
ఈ జన్మే అంతా నీదమ్మా
చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
అమ్మలేని ఆ బ్రహ్మ రాత రాసినాడమ్మా
అమ్మలేని వారిని చేసి కోత కోసినాడమ్మా
ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా
మన అమ్మను తేనేతేలేడే
చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
జోలాలి జోజో లాలి జో
చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా
జోలాలి జోజో లాలి జో
- చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
Puttintiki Raa Chelli
Movie More SongsChamathi Poobanthi (Male) Keyword Tags
-
-
-


