Song Details
Lyrics
పల్లవి: నిరంతరమూ వసంతములే మందారములా మరందములే స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండే నిరంతరము వసంతములే మందారములా మరందములే నిరంతరమూ వసంతములే మందారములా మరందములే స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండే నిరంతరము వసంతములే మందారములా మరందములే చరణం: 1 హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం అలలపై నాట్యమాడే వెన్నెలే వేణుగానం ఆకశానికవి తారలా ఆశకున్న విరి దారులా ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటే నిరంతరమూ వసంతములే మందారములా మరందములే స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండే నిరంతరము వసంతములే మందారములా మరందములే చరణం: 2 అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే మెరుపులేఖల్లు రాసి మేఘమే మూగవోయే మంచు ధాన్యాలు గొలిచి పౌష్యమే వెళ్ళిపోయే.. మాఘ దాహలలోనా అందమే అత్తరాయే మల్లె కొమ్మ చిరునవ్వులా మనసులోని మరుదివ్వెలా ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే నిరంతరమూ వసంతములే మందారములా మరందములే స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండే నిరంతరము వసంతములే మందారములా మరందములే
Lyrics sourced from public databases. May contain errors.