Song Details
Lyrics
పల్లవి: ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ చరణం: 1 విడిపోలేనీ విరి తీవెలలో ఉరులే మరులై పోతుంటే హోయ్ ఎడబాటేదీ ఎదలోతులలో అదిమే వలపే పుడుతుంటే తనువూ తనువూ తరువూ తరువై పుప్పొడి ముద్దే పెడుతుంటే పూలే గంధం పూస్తుంటే తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధనా ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ చరణం: 2 గళమే పాడె అల కోయిలలే వలచీ తెలిపే నా గీతం హోయ్ నదులై సాగే ఋతు శోభనమే అభిషేకించే మకరందం గగనం భువనం కలసే సొగసే సంధ్యారాగం అవుతుంటే లయలే ప్రియమై పోతుంటే హోయ్ వనమే యవ్వనమై జీవనమై సాగే రాధాలాపనా ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా
Lyrics sourced from public databases. May contain errors.