MovieGQ

Tholisaari Ninu Choosi

Preminchu (2001) · Track 1 of 7

Lyrics

లాలాల లాలల లాలాల లాలల లాలాల లాలాల లా తొలిసారి నిను చూసి ప్రేమించిన బదులిచ్చినావమ్మ ప్రియురాలిగ తొలిసారి నిను తాకి ప్రేమించిన మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా కలలోను ఇలా కలిసుండాలని విడిపోని వరమీయవా అన్నది ప్రేమ ఓ ఓ ఓ అన్నది ప్రేమ తొలిసారి నిను తాకి ప్రేమించిన మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా తూగే నా పాదం నువ్వే నడిపిస్తుంటే సాగింది పూబాట మీదుగా ఊగే నీ ప్రాయం నా వేలే శృతి చేస్తుంటే మోగింది వయ్యారి వీణగా ముద్దుల ఊసులు మబ్బుల వేడికి తీసుకు వెళ్ళాలి ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి అనుబంధానికి ప్రతిరూపం అని మన పేరే ప్రతి వారికి చెబుతుంది ప్రేమ ఓ ఓ ఓ చెబుతుంది ప్రేమ తొలిసారి నిను చూసి ప్రేమించిన బదులిచ్చినావమ్మ ప్రియురాలిగ లలలల లా లలలల లా లలలల లా లాలల లా నిన్నే నాకోసం పంపించడేమో బ్రహ్మ నడిచేని నా ఇంటి దీపం మా ఓ నీతో సావాసం పండించింది నా జన్మ నూరేళ్లు నా నొసట కుంకుమ వెచ్చని శ్వాసల యవ్వన గీతికి పల్లవి నువ్వంట పచ్చని ఆశల పువ్వుల తీగకి పందిరి నీ జంట మన బిగి కౌగిలి తన కోవెల అని కొలువుండి పోవాలని చేరింది ప్రేమ... చేరింది ప్రేమ తొలిసారి నిను తాకి ప్రేమించిన మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా కలలోను ఇలా కలిసుండాలని విడిపోని వరమీయవా అన్నది ప్రేమ ఓ ఓ ఓ అన్నది ప్రేమ లాలల లలలా లాలల లలలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Preminchu

See All