Haayamma Hai
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- హాయ్ అమ్మ హాయ్ హాయ్ అమ్మ
ఈ తుంటరి గాలేంటమ్మ నిలువెల్లా గిల్లుతోందమ్మా
దాయమ్మ దాయ్ దాయ్ అమ్మ
నా ఒళ్ళో దాక్కోవమ్మ గాలైన చేరలేదమ్మా
చెలినాదుకో పురుషోత్తమా
చెయ్యందుకో ప్రియ నేస్తమా
జడి వానతో సుడిగాలితో పడలేనయ ప్రియుడా
దాయమ్మ దాయ్ దాయ్ అమ్మ
నా ఒళ్ళో దాక్కోవమ్మ గాలైన చేరలేదమ్మా
హాయ్ అమ్మ హాయ్ హాయ్ అమ్మ
ఈ తుంటరి గాలేంటమ్మ నిలువెల్లా గిల్లుతోందమ్మా
గాలి ఖవ్వాలీలా గాన కచ్చేరీల ఊపు
రెచ్చే వయసు వయ్యారం
ఊపు తాళం వేసి కూని రాగం తీసి
తూగి పోయే తీగ సింగారం
నర నరంలో నిప్పు తరంగం
ఆప తరంకాని సుకుమారం
హత్తు మృదంగం కొత్త తతంగం
యమ కధం తొక్కు సింగారం
మునుపు ఎపుడు వినపడని మధురిమల
మొదటి చెలిమి శృతిలో
వలపు తలపులకు తలపు తెరిచి శివమెత్తే గతిలో
జత గీతమే జలపాతమై జతులాడే లయలో
దాయమ్మ దాయ్ దాయ్ అమ్మ
నా ఒళ్ళో దాక్కోవమ్మ గాలైన చేరలేదమ్మా
హా హాయ్ అమ్మ హాయ్ హాయ్ అమ్మ
ఈ తుంటరి గాలేంటమ్మ నిలువెల్లా గిల్లుతోందమ్మా
ఇంత కాలం ఇంత పెనుభారం
వంటరిగా ఉన్నాం కంట పడక
నిన్ను చూసే లేత నయగారం
కళ్ళుతెరిచిందా వెంటపడుతోందా
ఈడు పొంగుల్లో ఏడు రంగుల్లో
ఎంత బాగున్నదే చెలి అందం
ఎన్ని కళ్ళున్న చాలవంటుందే
పురి విప్పే నెమలి సౌందర్యం
చిటుకు చిటుకు మని తళుకు మెళికలను
చిదుము గిలుపు చలిలో
తొడిమ నడుము తెగ తడిమి తడిమి తరిమేసే గిలితో
చలగాటలో చలి వేటలో వణికించే గొడవ
హాయ్ అమ్మ హాయ్ హాయ్ అమ్మ
ఈ తుంటరి గాలేంటమ్మ నిలువెల్లా గిల్లుతోందమ్మా
దాయమ్మ దాయ్ దాయ్ అమ్మ
నా ఒళ్ళో దాక్కోవమ్మ గాలైన చేరలేదమ్మా
చెలినాదుకో పురుషోత్తమా
చెయ్యందుకో ప్రియ నేస్తమా
జడి వానతో సుడిగాలితో పడలేనయ ప్రియుడా
Preminchu
Movie More SongsHaayamma Hai Keyword Tags
-
-




