Kantene Amma Ani Ante Ela
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- కంటేనే అమ్మ అని అంటే ఎలా
కంటేనే అమ్మ అని అంటే ఎలా
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
కన్న అమ్మే కదా
కంటేనే అమ్మ అని అంటే ఎలా
కంటేనే అమ్మ అని అంటే ఎలా
కడుపుతీపి లేని అమ్మ బొమ్మేకదా
రాతి బొమ్మే కదా
కన కనలాడే ఎండకు శిరసు మాడినా
మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ
చారెడు నీళ్లను తాను దాచుకోక
జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
ఆ అమ్మలనే మించిన మా అమ్మకు
ఆ అమ్మలనే మించిన మా అమ్మకు
ఋణం తీర్చుకోలేను ఏ జన్మకు
కంటేనే అమ్మ అని అంటే ఎలా
కడుపుతీపి లేని అమ్మ బొమ్మేకదా
రాతి బొమ్మే కదా
ఎన్నో అంతస్థులుగా ఎదిగి పోయిన
మేడకున్న అసలు ఉనికి ఆ పునాది పైనే
సిరుల జల్లులో నిత్యం పరవసించిన
మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే
ప్రతి తల్లికి మమకారం పరమార్ధం
ప్రతి తల్లికి మమకారం పరమార్ధం
అదిలేని అహంకారం వ్యర్థం వ్యర్థం
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
కడుపుతీపి లేని అమ్మ బొమ్మేకదా
రాతి బొమ్మే కదా
Preminchu
Movie More SongsKantene Amma Ani Ante Ela Keyword Tags
-
-




