Song Details
Lyrics
ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాకా నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాకా వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం అనుక్షణం నా మనసు తహతహలాడే ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే అనుదినం కలలో నీ కథలే కనులకు నిదురలే కరువాయే ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాకా కోవేలలో కోరితిని నీ దరికి నను చేర్చమని దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని లేఖతో ముద్దైన అందించరాదా నినుకాక లేఖలనే పెదవంటుకోదా వలపులు నీ దరి చేరుటెలా ఊహల పడవలే చేర్చునులే ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాకా నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాకా
Lyrics sourced from public databases. May contain errors.