Elliyallo Elliyallo Endhaka
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- ChandrasekharG. Anand
Lyrics
- పల్లవి:
యేలియల్లో యేలియల్లో ఎందాకా...
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా
యేలియల్లో యేలియల్లో ఎందాకా...
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా
ఓలమ్మో తిరుణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా
ఓలమ్మో తిరుణాల గిలకా
వగలాడి వయ్యరి మొలకా
ఎన్నెల్లో ఇళ్లేయనా... చుక్కల్లో పక్కేయనా
ఎన్నెల్లో ఇళ్లేయనా... చుక్కల్లో పక్కేయనా
గోరంకా గోరంకా తుమ్మెదా
గీరెక్కిపోయింది తుమ్మెదా
గోరంకా గోరంకా తుమ్మెదా
గీరెక్కిపోయింది తుమ్మెదా
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా
ఆ మూడు ముళ్లెయ్యరా నూరేళ్ల పడకేయరా
ఆ మూడు ముళ్లెయ్యరా నూరేళ్ల పడకేయరా
చరణం: 1
ఆలమబ్బు బుగ్గల మీద మెరెపు మెరిసి ఆడినట్టే
నీలికొండ గుండెల మీద వాన చుక్క జారినట్టే
వానచుక్క వాగులైయీ సముద్రాన కలిసినట్టే
వానచుక్క వాగులైయీ సముద్రాన కలిసినట్టే
రోజువారి మోజులన్నీ మేజువాణి ఆడినట్టే
ఓరయ్య నేనాడుకోనా వడినిండా నేనుండి పోనా
ఓరయ్య నేనాడుకోనా వడినిండా నేనుండి పోనా
యేలియల్లో యేలియల్లో ఎందాకా...
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా...
చరణం: 2
రేతిరంతా నిద్దరకాచి కలువపూలు నవ్వినట్టే
రేపుమాపు ఆకాశం ఆకువక్క యేసినట్టే
పడమటేపు పడకేసి సూరిగాడు దొర్లినట్టే
పడమటేపు పడకేసి సూరిగాడు దొర్లినట్టే
ఊరివైపు తలుపు తీసి తొంగి చూసి నవ్వినట్టే
సంధెల్లో చిందేయనా పొద్దెల్లే ముద్దెట్టనా
సంధెల్లో చిందేయనా పొద్దెల్లే ముద్దెట్టనా
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా
ఓరయ్య చంద్రయ్య కొడకా
పొద్దెల్లే నాయింట పడకా
ఎన్నెల్లో ఇళ్లేయనా చుక్కల్లో పక్కేయనా
ఆ మూడు ముళ్లెయ్యరా నూరేళ్ల పడకేయరా
యేలియల్లో యేలియల్లో ఎందాకా...
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా...
యేలియల్లో యేలియల్లో ఎందాకా...
యాలమీది పోయేరమ్మ గూటిచిలకా...
Pranam Khareedhu
Movie More SongsElliyallo Elliyallo Endhaka Keyword Tags
-
-