MovieGQ

Manasuna Manasai

Pelli Chesukundam (1997) · Track 5 of 6

Song Details

Lyrics

మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే తరగని వరమై ఎదల్లో సరిగమ స్వరమై పెదాల్లో పాడుతోంది నువ్వే నీకు పరిచయమై తొలి ప్రేమ చవిచూశా నేను పరవశమై హృదయాన్ని పరిచేశా నువ్వే నా దైవంలా భావించా మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే ప్రియ జతలో సన్నిధిలో తెలిసెను సంక్రాంతి చెలి ఒడిలో మనుగడలో దొరికెను సుఖశాంతి అడగక ముందే ఆమనిలా కనుల ముందే మెరిశావు గ్రహణము విడిచే జాబిలిలా తళుకుమంటూ వెలిగావు ప్రాణంలో ప్రాణంగా నిలిచావు మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే శిలలాంటి శిథిల వనం చిగురులు తొడిగింది కలయికతో ప్రణయ రథం పరుగులు తీసింది పిలిచిన పలికే పెన్నిదిలా వలపు నిధులే పంచావు అతిథిగ చేరి హారతిలా చలువ చెలిమే చిలికావు అందించా అర్పించా అణువణువు మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే నీకు పరిచయమై తొలి ప్రేమ చవిచూశా నేను పరవశమై హృదయాన్ని పరిచేశా నువ్వే నా దైవంలా భావించా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pelli Chesukundam

See All