MovieGQ

Pelluna Virigindiro

Peda Babu (2004) · Track 6 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

ఫెళ్ళున విరిగిందిరో శివధనసు పెళ్ళికి రమ్మందిరో సీత మనసు ఆకాశం పందిట్లో అక్షింతలై భూదేవి గుండెల్లో పులకింతలై కళ్యాణం సంబరానికీ....హొయ్...హొయ్...హొయ్....హొయ్.... మత్తుగా గమ్మత్తుగా... చిత్తుగా చిర్రెత్తగా వెచ్చగా గుండెల గిచ్చగా మెచ్చగా కోర్కెలు రెచ్చగా జత పెదవుల్లో కధలన్నీ... శృతిలయ ఒడిలో సవరిస్తే పదనిసలాడే పరువంలో... మదనుడు నీవై కవ్విస్తే జివ్వును నవ్వుల్లో తేలించనా... యవ్వన పువ్వుల్లో దొర్లించనా కోరుకున్న కొండంత దైవం... కోర్కెలన్నీ తీరుస్తానంటే అందుకేగా నా అర్ధ భాగం..ముందుగానే ముడిపిచ్చుకుంది అల్లుకో నను గిల్లుకో ... హరివిల్లుగా నను దాచుకో రెచ్చిపో నను గుచ్చుకో... నులివెచ్చగా వాటేసుకో బంగినపల్లి బంగారమ్మా రంగుల బుట్ట గంగానమ్మా చిందులు తొక్కే సింగారమ్మా టింగుల టంగుల తాయారమ్మా తొలకరి జల్లై నువ్వొస్తే... వలపుల వొళ్లే తడ్పేస్తే పిడికెడు నడుమే అందిస్తే ...పిడుగుల మెరుపై మెలికేస్తే అమ్మొ నాకేదో భయమేస్తుంది... ముందే నన్నిట్లా వొణికిస్తుంటే కొత్తలో మరి ఏ జంతకైనా ... చిత్తరంగా వుంటుందిలే పైట చెంగుల పందేలతోటి... పగలూ రేయీ గడిచేనులే కొద్దిగా చలిముద్దగా...కౌగిళ్ళలో ఆడొచ్చులే వొద్దులే అసలొద్దులే...సరిహద్దులే దాటొద్దులే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Peda Babu

See All