Song Details
Lyrics
బావ....బావ...బావ...ముగ్గులోకి రావా ముద్దులాడి పోవా ... సింగారంగా భామ... భామ...భామ...ముగ్గులోని ప్రేమా ముద్దబంతి సిగ్గులా వుండాలంట అలాగైతే ఇలా వచ్చి ....భలేగ పెళ్ళి చుక్క పెట్టరాదా ప్రేమకైనా పెళ్ళికైనా.... అదేదో కలిసివచ్చే కాలముందిగా ముద్దు పుట్టినప్పుడే చంకనెక్కమంటే మొక్కుబడి మాటలింక ఎందుకంట హేయ్ చంకలోన బిడ్డకు చందమామ ముద్దుకు..... సంబరాల వేళ కాదుగా కొండమీద పొద్దుకి..... కలువలమ్మ ముద్దుకి బంధమేదో... అనుబందమేదో కారుమబ్బులొచ్చినా...కాలమెంత మారినా తీరదంటా..ప్రేమా మారదంటా. కలవపువ్వు రేకులన్ని రాల్చకుండా కాలమంత వుంటుందా... హొయ్... చేసుకున్న పుణ్యమే దేనికైనా ఆశ తీర్చకుంటుందా... అందుకే నా బావా... నా పొందులోకి రాలేవా శివ శివ ఓ బేలా ఇక్కడెందుకీ గోలా వాన చుక్క వరద...తేనె చుక్క సరదా అందినప్పుడే.. దాన్ని పొందినప్పుడే చేను పంటకైనా... చేదు నోటికైనా తియ్యనేగా...తీపి బంధమేగా సృష్టికే మూలమైన ముద్దులాట నోచుకున్న వారికంట...హొయ్.... అందుకే అందమైన ఆశలన్నీ పొందుకోరే మోజులన్నీ.... శివ శివ ఏమిటంటా... యిప్పుడెందుకీ తంటా చక్కనైన మన జంటా... మక్కువే తీర్చమంటా
Lyrics sourced from public databases. May contain errors.