Yedarilo Koyila Thellarani Reyila
Song
Movie
-
Music Directors
- Rajan
Lyricist
-
Singer
-
Lyrics
- పల్లవి:
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పూదారులన్ని గోదారికాగా .. పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
చరణం: 1
పల్లవించు ప్రతిపాటా బ్రతుకు వంటిదే
రాగమొకటి లేక తెగిన తీగవంటిదే "
ఎద వీణపై ..అనురాగమై.. తలవాల్చి నిదురించు నా దేవతా
కల ఆయితే ..శిల అయితే.. మిగిలింది ఈ గుండెకోతా
నా కోసమే ..విరబూసినా.. మనసున్న మనసైన మరుమల్లికా
ఆమనులే ..వేసవులై.. రగిలింది ఈ రాలుపూత ...
రగిలింది ఈ రాలుపూత.....విధిరాతచేతా..నా స్వర్ణసీతా..
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా..
చరణం: 2
కొన్ని పాటలింతే..గుండెకోతలోనే చిగురిస్తాయ్
కొన్ని బ్రతుకులంతే..వెన్నెలతో చితి రగిలిస్తాయ్ "
ఆ రూపమే.. నా దీపమై ..వెలిగింది మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో ..వెన్నెలగా.. వెలిగించి తన కంటిపాపా
చలిమంటలే ..చితిమంటలై.. చెలరేగె చెలిలేని నా కౌగిటా
బ్రతుకంటే ..మృతికంటే.. చేదైన ఒక తీపి పాట
చేదైన ఒక తీపి పాటచేదైన ..చెలిలేని పాటా..ఒక చేదుపాటా..
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పూదారులన్ని గోదారికాగా .. పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
- పల్లవి:
Panthulamma
Movie More SongsYedarilo Koyila Thellarani Reyila Keyword Tags
-