MovieGQ

Manaseriginavadu Maa Devudu Sriramudu

Panthulamma (1978) · Track 7 of 7

Song Details

Lyrics

పల్లవి: మనసెరిగినవాడు మా దేవుడూ... శ్రీరాముడూ మధుర మధుర తర శుభనాముడు..గుణధాముడు... మనసెరిగినవాడు మా దేవుడూ... శ్రీరాముడూ చరణం: 1 ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు మానవుడై పుట్టి మాధవుడై నాడు..ఆ.... తలచిన వారికి తారకరాముడు పిలిచిన పలికే చెలికాడు సైబోడు కోలువై ఉన్నాడు కోదండరాముడు మన తోడుగా .. నీడగా .. రఘురాముడు... మనసెరిగినవాడు మా దేవుడూ... శ్రీరాముడూ చరణం: 2 కడకు బోయను ఆది కవిని చేసిన పేరు గరళకంఠుని నోట తరలి వచ్చిన పేరు ఇహపర సాధనకు ఇరువైన పేరు.... శబరి ఎంగిలి గంగా తానమాడిన పేరు హనుమ ఎదలో భక్తి ఇనుమడించిన పేరు రామ రామ అంటే కామికమే తీరు కలకాలము మమ్ము కాపాడు పేరు.... మనసెరిగినవాడు మా దేవుడూ... శ్రీరాముడూ.. మధుర మధుర తర శుభనాముడు..గుణధాముడు... మనసెరిగినవాడు మా దేవుడూ... శ్రీరాముడూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Panthulamma

See All