Song Details
Lyrics
నువు నడిచే ఈ నేల పైనే నడిచానా ఇన్నాళ్లుగా నే ఈ క్షణమే ఆపాలనున్నధి ఈ భూభ్రమణమే ! నీ చెలిమి వద్దంటూ గతమే బంధీగా చేసిందీ నన్నే తక్షణమే చేయాలనున్నధి తనతో యుద్ధమే ఇవ్వాలే తెగించా ఇదేనేమో స్వేఛ్చ తెలికే తెంచావే నా ఇన్నాళ్ళ సంకెళ్లనే హృదయం జరిపే తొలి తిరుగుబాటిది నిను దాయడమే తన జన్మ హక్కని ఒంటరి తనపు ఖైదిన్క వద్దనీ నన్నొదిలెనే.. ఇదివరకేపుడు నా ఉనికినెరగని దుర్భేధ్యాల నీ మనసు కూతని ముట్టడి చేసి గెలిచేందుకొచ్చెనే నా హృదయమే.. ఏకాంతమంత అంతం అయేంత ఓ చూపు చూడే చాలికా మరు జన్మ సైతం రాసేసి ఇస్తా నా రాజ్యమంతా ఏలికా. నీ మౌనంలో దాగున్న ఆ గరళమే దాచేసి అవుతున్నా నేనచ్చంగా ముక్కంటినే.. హృదయం జరిపే తొలి తిరుగుబాటిది నిను దాయడమే తన జన్మ హక్కని ఒంటరి తనపు ఖైదిన్క వద్దనీ నన్నొదిలెనే.. ఇధివరకేపుడు నా ఉనికీనెరగని దుర్భేధ్యాల నీ మనసు కూతని ముట్టడి చేసి గెలిచేందుకొచ్చెనే నా హృదయమే..
Lyrics sourced from public databases. May contain errors.