Song Details
Lyrics
నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన ఎడబాటు రేపిన విరహావేధనా నరకయాతనా కాలమే దీపమై దారి చూపునా నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన చరణం: 1 కళ్ళల్లోన నిన్ను దాచిన ఊహాల్లోన ఊసులాడిన స్వప్నంలోన యెంత చూసిన విరహమే తీరదె జాజి కొమ్మ గాని ఊగిన కాలిమువ్వ గాని మోగిన చల్ల గాలి నన్ను తాకినా నీవనే భావనే ఎదురుగా లేనిదే నాకేంతోచదే రేపటి వేకువై రావే... నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన చరణం: 2 నిన్ను తప్ప కన్ను చూడదే లోకమంత చిమ్మ చీకటే నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖి నమ్మవే గుండె గూడు చిన్నబోయనే గొంతు ఇంక మూగబోవునే నీవు లేక ఊపిరాడదే ఓ చెలి చేరవే ఆశలు ఆవిరై మోడైపోతినే తొలకరి జల్లువై రావే... నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన ఎడబాటు రేపిన విరహావేధనా నరకయాతనా కాలమే దీపమై దారి చూపునా నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన
Lyrics sourced from public databases. May contain errors.